NTV Telugu Site icon

Bike Stunts: వెనుకో అమ్మాయి.. ముందో అమ్మాయితో.. బైక్‌పై యువకుడి డేంజరస్‌ స్టంట్స్.. వీడియో వైరల్

Bike Stunts

Bike Stunts

Bike Stunts: ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్‌ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వీడియోలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలతో కలిసి బైక్ స్టంట్ చేస్తున్నాడు. ఓ అమ్మాయి ముందు కూర్చోగా.. మరొకరు వెనుక ఉన్నారు. ఈ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, “బీకేసీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. నిందితుడిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలోని వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, మీరు మాకు నేరుగా మెసేజ్‌ చేయవచ్చు.” అని ట్వీట్ చేశారు. ఈ వీడియోను మొదట పాత్‌ హోల్ వారియర్స్ ఫౌండేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ముంబై పోలీసులు మరో ట్వీట్‌లో, “జరిమానా మాత్రమే కాదు, ఈ వీడియోలో చూసిన నిందితులపై కేసు కూడా నమోదు చేయబడింది. వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇద్దరు యువతులపై కూడా కేసు నమోదు చేశారు. అదే ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్ 114 కింద కేసు నమోదు చేశారు.

Read Also: Amritpal Singh Hunt: పంజాబ్ సీఎం కూతురికి ఖలీస్థానీ గ్రూప్ నుంచి బెదింరిపులు

ఇదిలా ఉండగా.. మార్చి 15 న, హర్యానా పోలీసులు వైరల్ వీడియోకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో ఒకరు గురుగ్రామ్‌లో కదులుతున్న కారు నుండి కరెన్సీ నోట్లను విసిరినట్లు అధికారులు తెలిపారు. నిందితులను జోరావర్ సింగ్ కల్సి, గురుప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జోరావర్‌ సిగ్‌ కల్సి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు మోటారు సైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు ఈ వీడియోను రికార్డ్ చేస్తున్నారు. జోరావర్ సింగ్ కల్సి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, అతని కారు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది.

Show comments