Bike Stunts: వెనుకో అమ్మాయి.. ముందో అమ్మాయితో.. బైక్‌పై యువకుడి డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Stunts: ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వీడియోలో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలతో కలిసి బైక్ స్టంట్ చేస్తున్నాడు. ఓ అమ్మాయి ముందు కూర్చోగా.. మరొకరు వెనుక ఉన్నారు. ఈ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో ఇలా వ్రాశారు, “బీకేసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. నిందితుడిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలోని వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, మీరు మాకు నేరుగా మెసేజ్ చేయవచ్చు.” అని ట్వీట్ చేశారు. ఈ వీడియోను మొదట పాత్ హోల్ వారియర్స్ ఫౌండేషన్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ముంబై పోలీసులు మరో ట్వీట్లో, “జరిమానా మాత్రమే కాదు, ఈ వీడియోలో చూసిన నిందితులపై కేసు కూడా నమోదు చేయబడింది. వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇద్దరు యువతులపై కూడా కేసు నమోదు చేశారు. అదే ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 114 కింద కేసు నమోదు చేశారు.
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
dangerous Stunt with 2 pillion rider one in front & one at rear,
no helmet & doing whilly !they know that Mumbai roads hv became #PotholesFree now…!
pls catch him @MTPHereToHelp
bike reg no. is Mh01DH5987 pic.twitter.com/tvYeRMDR39
— @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) March 30, 2023
Read Also: Amritpal Singh Hunt: పంజాబ్ సీఎం కూతురికి ఖలీస్థానీ గ్రూప్ నుంచి బెదింరిపులు
ఇదిలా ఉండగా.. మార్చి 15 న, హర్యానా పోలీసులు వైరల్ వీడియోకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో ఒకరు గురుగ్రామ్‌లో కదులుతున్న కారు నుండి కరెన్సీ నోట్లను విసిరినట్లు అధికారులు తెలిపారు. నిందితులను జోరావర్ సింగ్ కల్సి, గురుప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జోరావర్ సిగ్ కల్సి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు మోటారు సైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు ఈ వీడియోను రికార్డ్ చేస్తున్నారు. జోరావర్ సింగ్ కల్సి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, అతని కారు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!