Site icon NTV Telugu

Ssc Paper Leak : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు

Paper Leak

Paper Leak

తెలంగాణలో సంచలనం రేపిన పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహరంలో వరంగల్ కోర్టు విచారణ చేసి మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సాయంత్రం లోపు నింధితులు విడుదలైయ్యే అవకాశం ఉంది. ఖాజీపేట్ రైల్వే కోర్టులో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగాయి. నిందితులు బయటకు వస్తే సాక్షాలు ప్రభావితం అవుతారని బెయిల్ ఇవ్వకుడదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు.

Read Also : Nachinavadu Teaser: ప్రపంచంలో పెళ్లి కానీ వెధవలు చాలామంది ఉన్నారు

అయితే A1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2, A3, A5.. ఎలా ప్రభావితం చేస్తారని బీజేపీ లీగల్ సెల్ న్యాయ వాదులు ప్రశ్నించారు. 10 వ తరగతి పరీక్షలు నేటితో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు చేసిన వాదనకు మేజిస్ట్రేట్ ఏకీభవించింది. దీంతో న్యాయ మూర్తి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. 20 వేల పూచీకత్తు.. అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దనే కండిషన్ తో బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేశారు. సాయంత్రం లోపు కరీంనగర్ జైలు నుంచి నిందితులు ప్రశాంత్, మహేష్, శివ, గణేష్ లు విడుదల కానున్నారు.

Read Also : Aditya Thackrey Meets Ktr : కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే భేటీ..!

దీంతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పేపర్ లీకేజీపై బీఆర్ఎస్-బీజేపీ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. తమను కావాలనే ఈ కేసులో ఇరికించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. వారికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా పదో తరగతి పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుంది. అసలు నిందితులను వదిలే ప్రసక్తి లేదని అధికారులు అంటున్నారు.

Exit mobile version