Hyderabad: అంబర్‌పేట్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంట్లో రామ్ రాజ్ (55), మాధవి (50) ఇద్దరు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్‌కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్య పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్‌కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.
READ MORE: Student Suicide: ఇన్ఫోసిస్‌లో రూ. 17 లక్షల ప్యాకేజీ.. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సూసైడ్..
Also Read
- బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
“ఆర్థిక భారం అధికంగా ఉండడంతో ఫ్యామిలీ ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు.. ఆర్థిక వ్యాపార లావాదేవీలు నష్టం రావడంతో ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు.. సూసైడ్ నోట్ లభ్యం అయింది.. ఆర్థిక భారం కారణంగా సూసైడ్ చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశారు.. తెల్లవారు 3 గంటల 15 నిమిషాలకు రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్ లో మెసేజ్ చేశాడు.. రవి తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలు ఇద్దరు హంగింగ్లో కనిపించారు.. వెంటనే 100 డైల్ కి కాల్ చేశారు ఘటన స్థలానికి పోలీసులు క్లూస్ టీం చేరుకున్నారు.. అంబర్పేట్ లో ల్యాండ్ మార్క్ హోటల్ బిజినెస్ రన్ చేశారు మల్లపల్లిలో బిరియాని సెంటర్ నడిపారు రామ్ రాజ్ ఫ్యామిలీ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. మొదట మాధవి చనిపోయింది, ఆమె ముఖం పై దిండుతో ఊపిరి ఆడకుండా చేయడంతో చనిపోయినట్లు అనుమానం ఉంది.. ఆ తర్వాత రామ్ రాజ్ హ్యాంగ్ చేసుకున్నాడు.. శశాంక్ తన మణికట్టు కట్ చేసుకున్నాడు, ఆ తర్వాత అతను హ్యాంగ్ వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రామ్ రాజ్ ఫ్యామిలీ ఎవరైనా అప్పులు ఇచిన వారు భయపడితే చనిపోయారా? ఎవరైనా త్రేటన్ చేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం” అని సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య వెల్లడించారు.
తాజావార్తలు
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!