Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో వరుస అపచారాలు.. మొన్న నమాజ్.. నేడు మద్యం తాగి..

Ttd

Ttd

తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మద్యం తాగడం, ఎగ్ బిర్యానీ తినడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండ్రోజుల కిందట తిరుమలలోను కళ్యాణవేదిక వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం మతస్తుడు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భక్తుల్లో ఒక్కసారిగా అసహనం వ్యక్తమైంది. నమాజ్ చేసిన వ్యక్తితో పాటు, వీడియో తీసిన వ్యక్తిని సైతం కేసు నమోదు చేశారు.

READ MORE: Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!

ఇదిలా ఉండగా.. నిన్న పోలీసులే తిరుమలకు మద్యం సేవించి వచ్చారు. తాగిన మత్తులో అతివేగంతో వాహనం నడుపుతూ.. ఆక్సిడెంట్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలుకి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్‌ రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. ఫుల్‌గా మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్‌ స్టేషన్‌కు వారిని తరలించారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గా గుర్తించారు. డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్‌ ఘటన స్థలం నుంచి పరారీ కాగా, పోలీసులు విచారణ చేపట్టారు.

READ MORE: Mahesh Goud: ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఘనంగా పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

 

Exit mobile version