NTV Telugu Site icon

Mumbai: నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ కూలి ముగ్గురు కార్మికులు మృతి..

Mumbai

Mumbai

మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్‌లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 20 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులోని స్లాబ్‌లో కొంత భాగం కూలిపోయిందని ఒక అధికారి తెలిపారు. క్షతగాత్రులను MW దేశాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భవనం SRA ప్రాజెక్ట్‌కు సంబంధించినదిగా అధికారులు చెబుతున్నారు. కొంతమంది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నట్లు తెలిపారు.

Read Also: GOAT: గోట్ సినిమాలో విజయ్ తో పాటు ఎవరెవరికి ఎంత ఇచ్చారంటే?

ఇదిలా ఉంటే.. బుధవారం (సెప్టెంబరు 4) సాయంత్రం, చెంబూరులోని ఏకతా మిత్ర మండలం సరస్వతి గల్లీలో రెండంతస్తుల నివాస భవనంలో కొంత భాగం కూలిపోవడంతో ఏడాదిన్నర పసికందు మృతి చెందింది. అలాగే.. ఓ మహిళ గాయపడింది. గాయపడిన మహిళ కవితా సాల్వే (35) రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read Also: Healthy Body: మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా..? ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు

Show comments