దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు గాను విజయ్ కి ఏకంగా 200 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వగా ఇతర నటీనటులు మరియు దర్శకుడు వెంకట్ ప్రభు అందుకున్న పారితోషికం గురించి సమాచారం ఇప్పుడు వెల్లడయింది. విజయ్ తర్వాత అత్యధిక పారితోషికం ‘గోట్’ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న దర్శకుడు వెంకట్ ప్రభుదేనని అంటున్నారు.
Poonam Kaur: ‘పవర్ రేపిస్ట్’.. కలకలం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
అందుకు తగ్గట్టుగానే వెంకట్ ప్రభు ‘గోట్’ సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. కరోనా సమయంలో, రజనీకాంత్ -ధనుష్‌లను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం రాసుకున్న ఈ కథకి విజయ్ ఓకే చెప్పడంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ విజయవంతంగా విడుదల చేసింది. ఇక ‘గోట్’లో తలపతి విజయ్ స్నేహితుడిగా నటించిన ప్రభుదేవా మాములుగా సినిమాలో హీరోగా నటించినందుకు 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తుండడంతో తక్కువ పారితోషికం తీసుకున్నాడు. ప్రశాంత్ ఈ సినిమాలో నటించేందుకు 75 లక్షలు పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. నటుడు జయరామ్ ఈ సినిమాకు 50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. యంగ్ హీరో అజ్మల్… తొలిసారిగా తలపతి విజయ్ తో ఓ ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమాలో విజయ్‌తో కలిసి నటించేందుకు 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. హర సినిమాతో చాలా ఏళ్ల తర్వాత తమిళ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు మోహన్.. ‘గోట్’లో విలన్ పాత్రలో నటించినందుకు దాదాపు 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. చాలా ఏళ్ల తర్వాత దళపతి విజయ్ సరసన నటించిన నటి స్నేహ ఈ సినిమాకి గాను 30 లక్షల రూపాయల పారితోషికం అందుకుంది.