Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Three Chief Ministers Arrested In Jharkhand

Jharkhand: 23 ఏళ్ల చరిత్రలో ముగ్గురు సీఎంలు అరెస్ట్.. ఎవరెవరంటే..!?

Published Date :February 1, 2024 , 7:41 pm
By Suresh Maddala
Jharkhand: 23 ఏళ్ల చరిత్రలో ముగ్గురు సీఎంలు అరెస్ట్.. ఎవరెవరంటే..!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం ఝార్ఖండ్ తీవ్ర రాజకీయ సంక్షోభంపై ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇందులో ముగ్గురు సీఎంలు అరెస్ట్ కావడం విశేషం. ఈ ముగ్గురు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా మూడు సార్లు రాష్ట్రపతి పాలన కూడా విధించారు. తాజాగా మరోసారి ఆ పరిస్థితి దాపురించే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటిగా శిబు సోరెన్, రెండోది మధుకోడా, మూడోదిగా హేమంత్ సోరెన్.. ఇలా ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ అయిన వారు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వారు కావడంతో సర్వత్రా చర్చ సాగుతోంది.

శిబు సోరెన్..
బుధవారం సాయంత్రం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఝార్ఖండ్ చరిత్రలో ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ అయిన లిస్ట్‌లో మూడోవాడిగా చేరారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు సీఎంగా ఉన్నారు. అటు తర్వాత 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

మధు కోడా..
ఇక శిబు సోరెన్ తర్వాత మధు కోడా ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మధు కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో ఆయన దోషిగా తేలారు. దీంతో మధు కోడాకు మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు.

హేమంత్ సోరెన్..
తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఓ భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి శిబు సోరెన్, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రులుగా ఉండి అరెస్ట్ కావడం విశేషం.

రఘువర్ దాస్ మాత్రమే…
జార్ఖండ్ రాష్ట్రం నవంబరు 15, 2000 సంవత్సరమున ఏర్పడింది. ఇప్పటివరకూ ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chief Ministers
  • hemant soren
  • Jharkhand
  • Madhu Koda
  • shibu soran

తాజావార్తలు

  • Holi Evening Remedies for Money: హోలీ సాయంత్రం ఈ పనులు మాత్రం మరవకండి.. మీకు ఎంతో ధన లాభం..!

  • Bihar Next CM: బీహార్‌లో నితీష్ కుమార్ శకానికి అంతం.. తర్వాతి సీఎం ఈయనే..?

  • AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..

  • Dwcra Group: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. ప్రభుత్వం కీలక ప్రకటన..

  • Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్‌కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..

ట్రెండింగ్‌

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions