Site icon NTV Telugu

Delhi Crime: బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు సోదరులు కత్తులతో దాడి.. ఎందుకో తెలుసా..?

Delhi Crime

Delhi Crime

ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్‌లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.

Uttar Pradesh: పాఠశాల వద్ద వైన్ షాప్ తొలగించాలని కోర్టుకెక్కిన ఎల్‌కేజీ విద్యార్థి..

బాధితుడు బుధవారం రాత్రి తన సోదరులతో కలిసి వీధిలో తిరుగుతుండగా.. కత్తులు, కత్తెరతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. అక్రమ్‌, అతని ఇద్దరు సోదరులు దాడి చేసి.. ఘటన అనంతరం పరారైనట్లు చెప్పాడు. కాగా.. స్థానికులు గమనించి షాబాజ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kesineni Nani: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రోడ్‌షో

ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శశి గార్డెన్ ప్రాంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు అక్రమ్, ఖాసీం, ఆజాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Exit mobile version