Site icon NTV Telugu

Breaking News: అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident

Road Accident

Breaking News: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. స్వాములు వస్తున్న కారు తమిళనాడులోని దిందిగల్ సమీపంలో తేని దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏర్టిగా వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో.. ముగ్గురు స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మొత్తం ఐదుగురు భక్తులు ఉన్నట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రుని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: IAS Transfer: తెలంగాణలో 11 సీనియర్ ఐఏఎస్లు బదిలీ..

మృతుల స్వస్థలం ములుగు జిల్లా కమలాపురంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిలో సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Read Also: IND vs SA: విజృంభించిన అర్ష్‌దీప్‌, అవేశ్.. 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్!

Exit mobile version