Gun Firing: పోలీసులకు బహిరంగంగా సవాలు.. మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్
- ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం.
- పోలీసులకు బహిరంగంగా సవాలు..
- మార్కెట్లో కాల్పులు జరిపి రూ.10 కోట్లు డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing: ఢిల్లీలో మళ్లీ దోపిడీ రాజ్యం మొదలైంది. ఔటర్ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లోని ఫర్నిచర్ దుకాణం, ఔటర్-నార్త్ ఢిల్లీలోని అలీపూర్‌లోని ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై కాల్పులు జరిపి ముగ్గురు దుండగులు ఢిల్లీ పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నాంగ్లోయ్ ఘటనలో కాల్పులు జరిపిన ముష్కరులు కరపత్రాన్ని విడిచిపెట్టారు. స్లిప్‌లో గ్యాంగ్‌స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి రూ.10 కోట్ల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు నిందితుల ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
Also Read: Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్‌తో సహా మరో వ్యక్తి మృతి
Also Read
ఇకపోతే, ఢిల్లీ పోలీసు అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ ఈ ఘటనను ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన సమయంలో బాధితుడు తన దుకాణంలో ఉన్నాడు. అప్పుడు ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు అతని దుకాణానికి వచ్చి గాలిలోకి కాల్పులు ప్రారంభించారు. దుండగులు గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి స్కూటర్‌పై పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది.
Also Read: Revanth Reddy: బలహీనుడి గళం.. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం..
దుండగులను గుర్తించామని, వారిని అరెస్టు చేయడానికి అనేక బృందాలను నియమించామని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ప్రాణహాని ఉండేదని బాధిత దుకాణదారు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, డబ్బు కోసం మాత్రమే అక్రమార్కులు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఫర్నీచర్ షాపుపై కాల్పులు జరిపిన దుండగులు గ్యాంగ్ స్టర్ అంకేష్ లక్రా పేరు రాసి ఉన్న స్లిప్ ను వదిలేశారు. అందులో వారు 10 కోట్లు డిమాండ్ చేసారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను కూడా గుర్తించారు. త్వరలో అందరినీ అరెస్టు చేస్తామని పొలిసు అధికారులు అన్నారు. అయితే, ఎంత విమోచనం డిమాండ్ చేశారనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
#WATCH | Delhi: Information was received about an incident of firing at a shop in PS Nangloi area. The complainant said that three boys with their faces covered came to the shop, fired several rounds in the air and ran away. A case is being registered. Search for the accused is… pic.twitter.com/iiNwTwaqBm
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!