NTV Telugu Site icon

Liqour : మద్యంపై పోరు ప్రకటించిన ఆ తండా యువకులు

Liquor

Liquor

పచ్చని పల్లెల్లో , తండా లలో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. తండా యువకులు మద్యం పై పోరు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండా బెల్టు షాపుల మూలంగా. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.ఒక్కటైన తండా వాసులు తండా లో గల్లీ తిరుగుతూ మద్యం విక్రయాలను నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఆరు వందల జనాభా కలిగిన చిన్న తండాలోనే ఐదు బెల్ట్ షాపులు ఈ ఒక్క తండా లో ఉన్నాయంటే.. మద్యం విక్రయాలు ఏ స్దాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. రోజు కూలి పనులకు వెళ్లి రాత్రి అయిందా కంటే మద్యానికి బానిసైన కుటుంబాలను పట్టించుకోవడం లేదని.

Bigg Boss 8 : సోనియా ఆకులు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
కూలి డబ్బులు మొత్తం మద్యం తాగడానికి ఖర్చు చేయడంతో కుటుంబలు రోడ్డు న పడుతున్నాయి గ్రహించినతండా వాసులు. మద్యాన్ని తండా లోకి రాకుండా కట్టడి చేయాలని మద్య నిషేధానికి ఏకగ్రీవ తీర్మాణం చేశారు…తండాలో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు..ఎవరైనా తండా తీర్మానం వ్యతిరేకంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే లక్ష రూపాయల జరిమాన విధిస్తాం అని తీర్మానం చేశారు.తుర్కపల్లి పోలీసుల సహకారంతో సంగ్య తండా సంపూర్ణ మధ్యపానం నడుము కట్టారు.

Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..