Bigg Boss 8 : సోనియా ఆకుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
- సోనియా రెమ్యూనరేషన్ ఎంత?
- తాజా సమాచారం ప్రకారం.. సోనియాకు ఒక్కో వారానికి రూ. 2.00 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు 11 మందితో షో నడుస్తోంది. ఇప్పుడు నాలుగో వారం పూర్తికావడంతో ఈ రోజు నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లైన్లు ముగియడంతో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వారం ఎలిమినేషన్‌పై పూర్తి క్లారిటీ రానుంది. కాగా.. ఇందులో సోనియా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.
READ MORE: Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
సోనియా రెమ్యూనరేషన్ ఎంత?
బిగ్ బాస్ హౌస్‌లోకి మంచి అంచనాలతో వచ్చి విమర్శలను ఎదుర్కొన్న సోనియా ఆకుల నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే ఊహాగానాలు వినిసిస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సోనియాకు ఒక్కో వారానికి రూ. 2.00 లక్షలు ముట్టజెప్పినట్లు తేలింది. బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సోనియా ఆకులకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం రోజుకు రూ. 28 వేల చొప్పున వారానికి రూ. 2.00 లక్షలు చార్జ్ చేసిందట. అలా 4 వారాల పాటు ఉన్న సోనియా మొత్తంగా రూ. 8 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
READ MORE: Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?
ఇదిలా ఉండగా.. ఈ వారం నామినేషన్లలో నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనికా ఉన్నారు. శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను నామినేషన్ల నుంచి తప్పించాడు. ఈ వారం సోనియా, పృథ్వీ, నిఖిల్‌ల పనితీరు గురించి నబీల్ చాలా మాట్లాడాడు. ఆయన మాటలు ప్రేక్షకులకు నచ్చి ఓట్లు వేశారు. సోమవారం నాటి నామినేషన్లలో నబీల్, సోనియా మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. దీని తర్వాత నబీల్ మొత్తం ఓట్లలో 35 శాతం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత మణికంఠ ఎక్కువ ఓట్లు సాధించాడు. ప్రేరణ కూడా ఈ వారం సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియాలపై ఎలిమినేషన్ కత్తులు వేలాడుతుండగా.. నిఖిల్ అభిమానులు మాత్రం సోనియాను ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది కానీ బిగ్ బాస్ సోనియాను కాపాడి ఆదిత్య ఓంను ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉంటేనే కంటెంట్ ఉంటుందని బిగ్ బాస్ భావిస్తున్నారని, ఓటింగ్ తో సంబంధం లేకుండా మరోసారి ప్రేక్షకులను సోనియాను సేవ్ చేసి అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!