Site icon NTV Telugu

Thopudurthi Prakash Reddy: నువ్ మైసూర్ మహారాణివి ఏం కాదు.. పరిటాల సునీతపై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు!

Thopudurthi Vs Paritala

Thopudurthi Vs Paritala

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్ ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదు అని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావ్ అని ప్రశ్నించారు. హామీల అమలపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా?, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అంటావా? అని ఫైర్ అయ్యారు. పరిటాల ట్యాక్స్‌లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తోపుదుర్తి పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో భారీ స్కామ్ జరుగుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు పది వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు దమ్ము-ధైర్యం ఉంటే విచారణ చేయాలి. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ అవినీతిపరులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారు. పరిటాల ట్యాక్స్‌లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబానికి వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నాయి. పండగ రోజు 8 కార్లకు, గన్నులకు ఆయుధ పూజ చేశారు. ఇదంతా ప్రజలను దోచుకున్న సొమ్ము కాదా?’ అని తోపుదుర్తి ప్రశ్నించారు.

Also Read: Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!

‘పరిటాల కుటుంబం దానం చేసే కుటుంబం అని ఎమ్మెల్యే సునీతమ్మ గారు చెప్పుకుంటున్నారు. ఎక్కడ దానం చేశావో చెప్పాలి. మేం ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకున్నావ్. రైతుల కడుపులు కొట్టావ్. రాప్తాడు నియోజకవర్గంలో మీ టీడీపీ కార్యకర్తలనే చెప్పమను.. పరిటాల కుటుంబం దానం ధర్మం చేస్తాడని. ఓ రైతు మీద నువ్ 50 లక్షలు సంపాదించావ్. మీరు దానం చేయడం కాదు.. రక్తం పిండి వసూల్ చేశారు. ధర్మవరం చేనేత వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేశారు. హామీల అమలపై ప్రశ్నించిన వారికి చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటున్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తించాలి’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డివార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version