ఆర్టీసీ విలీనం బిల్లు గవర్నర్ వద్ద ఆగిందని, అసెంబ్లీ ఆమోదం తరువాత మళ్ళీ గవర్నర్ ఆమోదం అవసరమన్నారు టీఎస్ ఆర్టీసీటి ఎంయూ అధ్యక్షుడు థామస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే గవర్నర్ ఆర్టీసి విలీన బిల్లు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. సాయంత్రం లోపు గవర్నర్ ఆమోదముద్ర వేయాలని, లేదంటే మళ్ళీ ఆందోళనలు, రాజభవన్ ను ముట్టడిస్తామన్నారు థామస్ రెడ్డి, ఆర్టీసీ పై సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉండాలన్నారు థామస్ రెడ్డి. ఈనెల నుండే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, క్యాడర్ల వారిగా అందరికి న్యాయం చేయాలని థామస్ రెడ్డి కోరారు. అధ్యయన కమిటీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు అవకాశం కల్పించాలని, ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందొద్దన్నారు.
Also Read : Israel: 5,500 ఏళ్ల నాటి గేటును కనుగొన్న పరిశోధకులు.. పురాతన పట్టణీకరణపై పరిశోధన
మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఏపీలో ఆర్టీసీ విలీనంలో చాలా లొసుగులు ఉన్నాయన్నారు థామస్ రెడ్డి. అలాంటి వాటికి తావులేకుండా ఉండేందుకు ప్రత్యేక రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇచ్చామని థామస్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో.. టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ బిల్లుకు అనుమతి తెలుపడంతో ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి ఆమోదం కూడా వెనువెంటనే జరిగిపోయాయి. అనంతరం, అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ విలీనం బిల్లు అసెంబ్లీ ఆమోదం తరువాత.. రాజ్ భవన్‌కు చేరింది. అక్కడ గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.
Also Read : Adimulapu Suresh: త్వరలోనే అంబేడ్కర్ విగ్రహం ప్రారంభిస్తాం..