Site icon NTV Telugu

Nagababu: నేను ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడటం..

Nagababu

Nagababu

Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను ఇదే మొదటిసారి చూడటం అని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించిందన్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా అసెంబ్లీకి రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత.. పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని ఫోకస్ గా ఉన్నాడు.. పదవి తాలూకు పవర్ ను ఆశించేలా మేం లేము.. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏం లేదన్నారు. సినిమా వరకే పవన్ స్టార్.. ఆయన అసలులో రియల్ లీడర్ అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Nindha Review: వరుణ్ సందేశ్ ‘నింద’ రివ్యూ!

అయితే, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగ‌బాబు చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జ‌న‌సేన పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్‌.. ప్రజలు నిన్ను నమ్మలేదు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ విమర్శించిన వారందరి నోళ్లన్ని మూతపడేలా పవన్ కళ్యాణ్ బంఫర్ మేజార్టీతో విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇక, కొద్దిసేపటి క్రితం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో సీఎం చంద్రబాబు తర్వాత జనసేనాని ప్రమాణం చేశారు. దీంతో ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నామంటూ జ‌న‌సైనికులు ఎమోష‌న‌ల్ అయ్యారు.

Exit mobile version