NTV Telugu Site icon

Andhra Premier League: విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి.. నేటి నుంచి మ్యాచ్‌లు షురూ..

Apl

Apl

Andhra Premier League: విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్‌ హాజరయ్యారు. విశాఖ స్టేడియంలో నేటి నుంచి జులై 13వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో ఆరు టీమ్‌లు పాల్గొననున్నాయి. బెజవాడ టైగర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, వైజాగ్ లయన్స్, రాయలసీమ కింగ్స్ టీమ్‌లో ఈ టోర్నీలో గెలుపు కోసం ఆడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

Read Also: Ravindra Jadeja: టీ20 ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు

గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని, వారందరికీ ఏపీఎల్ అనేది మంచి వేదిక అని క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వందలాది మంది ప్లేయర్స్‌కు ఇదో సువర్ణ అవకాశమని మంత్రి చెప్పారు. కొత్త ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రమేయం ఉండడం వల్ల ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందన్నారు.