Eluru Crime: ఎక్కడిపడితే అక్కడ కేటుగాళ్లు మోపయ్యారు.. ఎవరైనా ఏ వస్తువును పోగొట్టుకుంటే.. వాకాబు చేసి మరీ ఇచ్చే రోజులు పోయాయేమో అనిపిస్తోంది. సైబర్ నేరాలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు.. ఇక వారి చేతికి ఏదైనా దొరికితే ఊరుకుంటారా? ఇప్పుడు ఏలూరులో అదే జరిగింది.. ఫోన్ పోగుట్టుకున్న ఓ వ్యక్తి.. తన ఫోన్ పోయిందంటూ పోలీసులను ఆశ్రయించాడు.. అప్పటికే అతడి ఖాతా నుంచి అందినకాడికి దోచేశారు దుండుగులు..
Read Also: VV Lakshminarayana: మళ్లీ పోటీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. ఈ సారి..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఫోన్ పోగొట్టుకున్నాడు అద్దేపల్లి ఫణీంద్ర అనే వ్యక్తి.. అయితే, తన ఫోన్ పోయిందంటూ ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు.. కానీ, ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చేలోపే అతడి బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు.. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఫోన్ పొగొట్టుకున్న వ్యక్తి ఫోన్ నుంచి లక్ష రుపాయలు కాజేశారు.. ఫోన్ పే ద్వారా 50 వేల రూపాయల చొప్పున రెండుసార్లు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఏలూరు నాగేంద్రకాలనీలో నివాసం ఉండే యువకుల బ్యాంకు ఖాతాలో డబ్బులు పడినట్టు గుర్తించారు. జాగ్రత్త మరి.. అసలే స్మార్ట్‌ఫోన్ల కాలం.. ఆ ఫోన్‌లోనే అన్నీ.. ఇక, సులువుగా పని అయిపోయేందుకు అన్ని బ్యాంకు ఖాతాలతో లింక్.. ఫోన్ పోతే మరి అంతే అన్నట్టు.