Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్‌కు మెయిల్ చేసిన దొంగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thief Send Email: ల్యాప్ టాప్ పొగొట్టుకున్నానన్న బాధలో ఉన్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. దొంగిలించిన దొంగ ఆ వ్యక్తికి మెయిల్ చేశాడు. ఈ మేరకు ల్యాప్‌టాప్ యజమాని జ్వెల్లీ థిక్సో అనే ట్విట్టర్ ఖాతాదారుడు దొంగ పంపిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేశాడు.
Read Also: Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ఆ దొంగ తనకు ఈ మెయిల్ నుంచి పంపిన సందేశాన్ని వివరించాడు. ‘బ్రో బతికేందుకు డబ్బు కావాలి.. ప్రస్తుతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నాను. అందుకే నిన్న నీ ల్యాప్ టాప్ దొంగిలించాను. కానీ మీరు పరిశోధనకు సంబంధించిన పనిలో ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్నాను. అందుకే దానికి సంబంధించిన ఫైల్స్ పంపించాను. దీనికి సంబంధించిన ఏవైనా అవసరమైన ఫైల్స్ ఉంటే గనుక సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌ను ఎవరికి విక్రయించాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి’ అని దొంగ చేసిన మెయిల్‌లో రాసివుంది.
Read Also: China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..
దీంతో లాప్ టాప్ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ దక్కినందుకు సంతోషపడాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగతనం చేస్తే చేశాడు.. కానీ విలువైన ఫైల్స్ పంపించాడు, ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
They stole my laptop last night and they sent me an email using my email, I have mixed emotions now.😩 pic.twitter.com/pYt6TVbV1J
— GOD GULUVA (@Zweli_Thixo) October 30, 2022
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!