Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Morbi Bridge: గుజరాత్ మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. దాదాపు 141మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఘటనకు కారకులుగా భావిస్తోన్న తొమ్మదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ, టికెట్ కలెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిర్వహణకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపించారు. దీంతో అక్కడ వంతెనను నిర్మిస్తున్న కంపెనీపై నేరపూరిత హత్య కేసు నమోదు చేశారు. ఐజీనీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
Read Also: Boy Killed Snake: నన్నే కాటేస్తావా..కొరికి చంపుతా.. పాముపై కోపంతో బాలుడు ఏంచేశాడంటే..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
‘ఇది ఇలా ఉండగా.. గుజరాత్ మోర్బీ బ్రిడ్జీ ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.’
Read Also: NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు
గుజరాత్ బ్రిడ్జి ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది మరణించగా.. 177 మందిని రక్షించారు. నదిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా మంది మోర్బి నివాసితులు ప్రజలను రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నారు. రక్తదానం చేసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. రక్తదానం చేసేందుకు వస్తున్నవారితో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!