Site icon NTV Telugu

Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్‎కు మెయిల్ చేసిన దొంగ

Laptop

Laptop

Thief Send Email: ల్యాప్ టాప్ పొగొట్టుకున్నానన్న బాధలో ఉన్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. దొంగిలించిన దొంగ ఆ వ్యక్తికి మెయిల్ చేశాడు. ఈ మేరకు ల్యాప్‌టాప్‌ యజమాని జ్వెల్లీ థిక్సో అనే ట్విట్టర్ ఖాతాదారుడు దొంగ పంపిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేశాడు.

Read Also: Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం

ఆ దొంగ తనకు ఈ మెయిల్ నుంచి పంపిన సందేశాన్ని వివరించాడు. ‘బ్రో బతికేందుకు డబ్బు కావాలి.. ప్రస్తుతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నాను. అందుకే నిన్న నీ ల్యాప్ టాప్ దొంగిలించాను. కానీ మీరు పరిశోధనకు సంబంధించిన పనిలో ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్నాను. అందుకే దానికి సంబంధించిన ఫైల్స్ పంపించాను. దీనికి సంబంధించిన ఏవైనా అవసరమైన ఫైల్స్‌ ఉంటే గనుక సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌ను ఎవరికి విక్రయించాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి’ అని దొంగ చేసిన మెయిల్‌లో రాసివుంది.

Read Also: China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..

దీంతో లాప్ టాప్ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ దక్కినందుకు సంతోషపడాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగతనం చేస్తే చేశాడు.. కానీ విలువైన ఫైల్స్ పంపించాడు, ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version