దొంగతనానికి వెళ్లి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయిన సంఘటనలు చూశాం కదా. మరికొందరు మద్యం మత్తులో దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయి యజమానులకు పట్టుబడిన కేసులు ఉన్నాయి. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు. యజమాని వచ్చి తాళం తీసి చూసే వరకు ఇత్తడి,ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించిన వైనం. పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పట్టించిన యజమాని మాలి పటేల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Kamareddy: దొంగతనానికి వెళ్లి.. ఇత్తడి, ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని ఇంట్లోనే పడుకున్న దొంగ

Thief