NTV Telugu Site icon

Jagadish Reddy: “విద్యుత్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.” మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jagadish Reddy

Jagadish Reddy

విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తుందని..ప్రభుత్వం అధికారికంగా ఈ అంశంపై స్పందించలేద మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఆదానికి అప్పగింతకు రేవంత్ సర్కార్ సిద్ధం అయినట్టు కనిపిస్తుందన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఓల్డ్ సిటీ తో ఆగదు..రాష్ట్రం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం ఖాయమని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు డబ్బుల వసూలుకు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ లో విద్యుత్ రంగం ను ప్రైవేట్ కి అప్పగించడం లో ఇది మొదటి మెట్టు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే పేదవారికి, రైతులకు విద్యుత్ సబ్సిడీ ఉండవు. ఉచిత విద్యుత్ ఉండదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిడులు వచ్చాయి.. కానీ కేసీఆర్ నో అన్నారు. ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చిన రాజీ పడలేదు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క

విద్యుత్ ను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే…జీవితాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… “రేవంత్ రెడ్డి సర్కార్… మోడీ సర్కార్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తన వైఖరి అధికారికంగా స్పష్టం చేయాలి. లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారు. ఒడిశా లో వరదలు వస్తె…అక్కడ విద్యుత్ రంగం లో ఉన్న ప్రైవేటు కంపెనీ ఇబ్బంది పెట్టింది. ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లుల వసూలు కావడం లేదన్నది పూర్తి అసత్యం. ఓల్డ్ సిటీలో 90 శాతం విద్యుత్ బిల్లులు వసూలు అయ్యాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ ను బిఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటీకరణ కుట్రను అందరు కలసి అడ్డుకోవాలి. ప్రభుత్వం చార్జీల వసూల కోసం బౌన్సర్ లకు అప్పగిస్తుందా ?. రెవేన్యూ రికవరి కోసం గుండా గ్యాంగ్ లకు అప్పగిస్తారా ?. ప్రభుత్వం చేయలేని పని….ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేస్తారు ?. ప్రజలను దొంగలు చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుంది.” సంచలన వ్యాఖ్యాలు చేశారు.