NTV Telugu Site icon

Satyamrajesh: పోలిమేరలో పోయించడానికి వస్తున్నారు..

Untitled Design (11)

Untitled Design (11)

సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్.

పొలిమేర ఎండ్ లో పొలిమేరకు సీక్వెల్ ఉండేలా  హింట్ ఇచ్చాడు దర్శకుడు. అందులో భాగంగానే సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర -2 ను తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌. థియేటర్లలో విడుదలైన పొలిమేర -2 ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాదు, పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ అందుకున్నాడు హీరో రాజేశ్. చిన్న చిత్రంగా  విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆల్  ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. కాగా పొలిమేర -2 చివరలో సీక్వెల్ ఉన్నట్టు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నేడు పొలిమేర -3కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాము. ఈ సారి రేసీ స్క్రీన్ ప్లే తో పాటు, అనేక ట్విస్ట్ లతో మీ ఊహకందని విధంగా ఉండబోతోంది, దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌ పార్ట్ -3ని  అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు నిర్మాతలు. ఈ సీక్వెల్ ఎంత మేరకు అలరిస్తుందో ఏ మేరకు భయపెడుతుందో చూడాలి.

Also Read: Kiran Abbavaram: ‘క’థ మారింది…హిట్టు దక్కేనా..?