NTV Telugu Site icon

IND vs NZ: రోహిత్-కోహ్లీ వైఫల్యం నుండి పంత్ రనౌట్ వరకు.. భారత్ ఓటమికి కారణాలు ఇవే..!

Team India Test

Team India Test

పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్‌ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్‌ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ లేకపోవడం ఓటమికి ప్రధాన కారణం. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ రనౌట్ కావడం భారత్ ఓటమికి మరో కారణం. పూణె టెస్టులో భారత్ ఎందుకు ఓడిపోయిందో కారణాలు తెలుసుకుందాం..

IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్

రోహిత్-విరాట్ విఫలమయ్యారు:
భారత జట్టులో ఇద్దరు ప్రముఖులు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. న్యూజిలాండ్‌పై ఓటమికి ఇదే అతిపెద్ద ప్రధాన కారణం. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే చేశాడు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ:
రోహిత్ శర్మ నుండి చాలా డిఫెన్సివ్ కెప్టెన్సీ కనిపించింది. కివీస్ బ్యాట్స్‌మెన్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సునాయాసంగా పరుగులు చేశారు. అలాగే మంచి ఫీల్డింగ్ సెట్ చేసుంటే తక్కువ స్కోరుకే పరిమితం చేయవచ్చు. బెంగళూరులో టెస్టులోనూ రోహిత్ శర్మ తప్పు చేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా.. ముగ్గురు స్పిన్నర్లను ఆడిపించాడు. ఈ క్రమంలో జట్టు 46 పరుగులకే ఔటైంది.

అశ్విన్-జడేజా స్పిన్ ఫలించలేదు:
పూణె టెస్టు పిచ్ స్పిన్నర్లకు బాగా ఉపయోగపడింది. అయితే వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. అశ్విన్, జడేజా నిరాశపరిచారు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ తొలిరోజు ఏడు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎట్టకేలకు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. అశ్విన్ మొత్తం 5 వికెట్లు తీశాడు.

వికెట్లు కాపాడుకోలేకపోయారు:
రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు నిలకడగా ఆడి లంచ్‌కు ముందు 81 పరుగులు చేశారు. అయితే.. రెండో సెషన్‌లో టీమిండియా 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడకుండా ఉండేందుకు బ్యాటర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో.. 174 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు పడిపోయాయి.

రిషబ్ పంత్ రనౌట్:
భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం. అయితే.. యశస్వి జైస్వాల్ 77 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత ఆశలు చిగురించాయి. ఆ తర్వాత.. అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంది. తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ గతిని చాలాసార్లు మార్చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. పంత్ ఒక్క సెషన్ బ్యాటింగ్ చేసి ఉంటే భారత్ మ్యాచ్ గెలిచి ఉండేది.