ఈ మధ్య కాలంలో థియేటర్లలో వస్తున్న సినిమాలకన్నా కూడా ఓటీటీలో వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఇప్పటికి ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే వీక్షిస్తారు తెలుగు రాష్టాల ఆడియెన్స్.. యాక్షన్, హారర్, లవ్ స్టోరీ మూవీస్, వెబ్ సిరీస్ లను అందిస్తూ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటుంది ఓటీటీ సంస్థ ఆహా.. ఇక్కడ ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్ వేద్దాం..
సుందరం మాస్టర్..
వైవా హర్ష హీరోగా వచ్చిన సినిమా సుందరం మాస్టర్..దివ్య శ్రీ పాద హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో కల్యాణ్ సంతోష్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. అలాగే గత నెల 28 నుంచి ఇక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇక్కడ టాప్ ప్లేసులో ఉంది..
భూతద్ధం భాస్కర్ నారాయణ..
క్రైమ్ కామెడీతో వచ్చిన లేటెస్ట్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ..దిష్టి బొమ్మకు సంబంధించిన డిఫరెంట్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. పురుషోత్తం రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 22 నుంచి ఇక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమా కూడా భారీ వ్యూస్తో దూసుకుపోతుంది.. ఆహా లో రెండో స్థానంలో ఉంది..
చెఫ్ మంత్ర సీజన్ 3..
నిహారిక కొణిదెల హోస్ట్‌గా వ్యవరిస్తున్న టాక్ షో చెఫ్ మంత్ర సీజన్ 3.. ఈ సీజన్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.. అడవి శేషు ఎపిసోడ్ మాత్రం ఇక్కడ ట్రెండ్ అవుతుంది.. ఆహాలో మూడో స్థానం లో ఉంది..
ఇవే కాదు.. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కిన సినిమా డబుల్ ఇంజిన్, బోల్డ్ సినిమా మిక్స్ అప్ లు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఈ సినిమాలు అన్ని ఆహాలో టాప్ 5లో ఉన్నాయి.. ఇక సుందరం మాస్టర్,భూతద్ధం భాస్కర్ నారాయణ..డబుల్ ఇంజిన్ సినిమాలను మాత్రం అసలు మిస్ కాకండి చూడండి..