లాస్ట్ ఇయర్ కిస్సిక్ బ్యూటీనంటూ ఐటమ్ సాంగ్‌తో కట్టిపడేసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన శ్రీలీల.. ఈ ఏడాదికొచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవడంలో తడబడింది. 2025లో ఒక్కటి కాదు రెండు కాదు.. త్రీ హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారీ. నితిన్‌తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగల్చగా.. వైరల్ వయ్యారీ అని హడావుడి చేసినా కూడా జూనియర్‌ను పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్టిచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో సక్సెస్ ట్రాక్ ఎక్కుదామనుకుంటే బొమ్మ భారీ డిజాస్టర్.
శ్రీలీల తరహాలోనే భాగ్య కూడా త్రీ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. కింగ్ డమ్ మినహాయించి కాంత, ఆంధ్రా కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. పైసల్ వసూలు చేసుకోవడంలో తడబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్క హిట్ కూడా చూడని అన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. మరో యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.. కన్నప్పలో అందాలు ఆరబోసినా ఫలితం దక్కలేదు. అటు మలయాళంలో మైనే ప్యార్ కియా అన్నా ఆడియన్స్ పట్టించుకోలేదు.
రాశీ ఖన్నా త్రీ ఇండస్ట్రీల్లో ఒక్కో ఫిల్మ్ చేసింది. కానీ అడుగుపెట్టిన మూడు చోట్ల ఫ్లాప్స్ చూసింది. అగత్యా, తెలుసుకదా, 120 బహుదూర్ డిజాస్టర్స్ టాక్ తెచ్చుకున్నాయి. కీర్తి సురేష్ ఉప్పుకప్పు రంబుతో ఓటీటీలో పలకరించింది. థియేటర్లలో రిలీజ్ చేయకూడదనుకున్న మేకర్స్ నిర్ణయం సరైనదే అనిపించేలా ఆడియన్స్ ఫీలయ్యేలా చేశారు. ఇక రివాల్వర్ రీటా ఎందుకొచ్చిందో, ఎప్పుడొచ్చిందో తెలియకుండా వెళ్లిపోయింది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తెలుగులో పలకరించలేదు కానీ.. తమిళంలో సూర్యతో రెట్రో, కూలీలో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. కూలీలో సాంగ్ తో మెప్పించినా.. వెయ్యి కోట్ల మూవీ కాస్త రూ. 500 కోట్లకే పరిమితమైందన్న ఫీలింగ్‌లో ఉండిపోయారు తమిళ తంబీలు. ఇక సూర్య రెట్రో సంగతి చెప్పనక్కర్లేదు. పేరుకు రూ. 235 కోట్లు అని పోస్టర్ వేసుకున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర.. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని కొట్టిపడేశారు అక్కడి ట్రేడ్స్. బీస్ట్ తర్వాత హిట్ చూడని కనిమా.. మూడేళ్ల ఫ్లాప్స్ పరంపరకు జననాయగన్‌తో అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి
