Site icon NTV Telugu

IND vs AUS: వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు ఇవే.. ఈరోజు మ్యాచ్లో సాధ్యమయ్యేనా..!

India

India

IND vs AUS: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే జరుగుతోంది. ఇప్పటికే సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో వన్డేలో కూడా గెలిచి వరల్డ్ కప్ కు ముందు సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగగా.. ఆరంభంలోనే గైక్వాడ్ పెవిలియన్ బాటపట్టాడు.

Read Also: KG George: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

అనతంరం బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. ఇతనితో పాటు మరో ఓపెనర్ గిల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి మధ్య 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు టీమిండియా బ్యాట్స్ మెన్స్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. దాంతో పాటు గిల్, అయ్యర్ భారీగా వ్యక్తిగత స్కోర్లు నమోదు చేశారు.

Read Also: TDP: 14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ నియామకం

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో భారత్ భారీస్కోరు దిశగా వెళ్తుండటంతో.. గతంలో గణాంకాలను అందుకునే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.

Exit mobile version