ప్రస్తుత రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఆచితూచి ఖర్చు చేస్తూ పొదుపుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సేవ్ చేసిన డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. స్టాక్ మార్కెట్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇప్పటికీ బ్యాంక్ ఎఫ్డీ ని ఎక్కువగా విశ్వసిస్తారు. బ్యాంక్ ఎఫ్డీ లో గ్యారంటీ రాబడి లభిస్తుంది. 3 సంవత్సరాల ఎఫ్డీ పై అత్యధిక రాబడిని ఇస్తున్న పెద్ద బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం. పైసా బజార్ వెబ్‌సైట్ ఆధారంగా ఈ జాబితాలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి.
Also Read:KunaRavikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
ఈ జాబితా ప్రకారం, పెద్ద ప్రభుత్వ బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంక్ 3 సంవత్సరాల FD పై అత్యధిక రాబడిని ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 3 సంవత్సరాల FD పై 6.50 శాతం రాబడిని అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులలో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక రాబడిని ఇస్తోంది. ఇది 3 సంవత్సరాల FD పై 6.50% రాబడిని అందిస్తోంది. దీనితో పాటు, ICICI వంటి ప్రముఖ బ్యాంకులు 3 సంవత్సరాల FD పై 6.60%, HDFC 6.45% అందిస్తున్నాయి. అదేవిధంగా, SBI వంటి పెద్ద ప్రభుత్వ బ్యాంకులు 6.30%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.40% అందిస్తున్నాయి.