నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది అని ఆమె తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది.. సత్యం తన బలమెంతో చూపించింది.