Site icon NTV Telugu

Shamshabad Airport: సీఎం వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి అందులోనే..!

Cm Revanth

Cm Revanth

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.

Read Also: Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌..

కాగా.. అదే విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ప్రముఖులు ఉన్నారు. ముంబై వెళ్లేందుకు వారు ఆ విమానం ఎక్కారు. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు విమానం ఎక్కగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట నుంచి విమానంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉండిపోయారు. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యలను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది.

Read Also: Poonam Kaur: గురూజీని వదలని పూనమ్.. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయనే అంటూ షాక్

Exit mobile version