NTV Telugu Site icon

Akhilesh Yadav: ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతుంది.. కోవిషీల్డ్ పై అఖిలేష్ ఫైర్..

Akilesh Yadav

Akilesh Yadav

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఈ అంశంపై ఇవాళ (బుధవారం) ఆయన ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్ చేశారు. ప్రాణాంతకమైన మందులను అనుమతించడం అంటే ఎవరినైనా హత్య చేయడానికి కుట్ర చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని ఎస్పీ చీఫ్ డిమాండ్ చేశారు. సుమారు 80 కోట్ల మంది భారతీయులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ‘కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారు నుంచి బీజేపీ పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంది అని ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలకు బలవంతంగా ఈ వ్యాక్సిన్ అందించిందని పేర్కొన్నారు.. ఈ విషయంలో బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు..

కాగా, తాము తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందని బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా కోర్టులో తెలిపింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే బ్రిటన్ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి కోవిషీల్డ్ పేరుతో అమ్మకాలు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఇదేనా మోడీ హామీ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ దేశ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments