NTV Telugu Site icon

DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..

Dgp

Dgp

పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1లక్ష 36, 638 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.. 5879 చోట్ల నిమజ్జన పాయింట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నీ శాఖల సమన్వయంతో కలిసి పనిచేశామని డీజీపీ పేర్కొన్నారు. ట్రైనీ ఎస్సైలు, కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది సైతం పాల్గొన్నారు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధుల్లో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది కృషి చేసారన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మొత్తం 300 ప్రాంతాల్లో యాత్రలు జరిగాయి.. చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు. ప్రజలు, భక్తులు ఎంతో సహకరించారని డీజీపీ అన్నారు. డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టింది.. డీజేల విషయంలో త్వరలో గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని తెలిపారు.

Read Also: Govt Hospitals: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. ఇబ్బందులు పడుతున్న రోగులు

మరోవైపు.. జైనూర్ ఘటన దురదుష్టకరం అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశాము.. అక్కడ పరిస్థితులు చేయి దాటి పోవడంతో పలువురిని అరెస్ట్ చేశామన్నారు. అక్కడ అలసత్వం వహించిన డీఎస్పీ పై వేటు వేశామని డీజీపీ పేర్కొ్న్నారు. అలాగే.. సంగారెడ్డి సాంఘిక బహిష్కరణ పైన కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదని చెప్పారు. మావోయిస్టు ప్రాబల్యం కోసం తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉందని అన్నారు. మావోయిస్టు కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం.. హైదరాబాద్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని చెప్పారు. కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి తాను కామెంట్ చేయలేనని అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.. రెడ్ కార్నర్ నోటీసులు కోసం ఇంటర్ పోల్‌కి లేఖ రాశామన్నారు. సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యు అవుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు.

Read Also: Job Gurantee: డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కోర్సులు.. వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం