NTV Telugu Site icon

Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి

Jai Shankar

Jai Shankar

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరపున ఛాన్సలర్ స్కోల్జ్‌కు వ్యక్తిగత శుభాకాంక్షలు తెలిపారు. అయితే జైశంకర్ పర్యటనకు సంబంధించిన ఓ చిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం జర్మనీలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నిజానికి.. జైశంకర్ ఈ పర్యటనలో బెర్లిన్‌లోని ప్రసిద్ధ హంబోల్ట్ ఫోరమ్‌కు చేరుకున్నారు. హంబోల్ట్ ఫోరమ్ అనేది మానవ చరిత్ర, కళ, సంస్కృతికి సంబంధించిన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మ్యూజియం. ఈ హంబోల్ట్ ఫోరమ్ బెర్లిన్ ప్యాలెస్ లోపల ఉంది. ఈ మ్యూజియం కోవిడ్ సమయంలో ప్రారంభించబడింది. ప్రపంచ సంస్కృతిని, కళలను అర్థం చేసుకున్న కళాభిమానులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. కాగా.. ప్రపంచం నలుమూలల్లో భారతీయ చరిత్ర ఉంది.

READ MORE: Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..

ఈ హంబోల్ట్ ఫోరమ్‌లో భారతదేశ చరిత్ర కూడా దాగి ఉంది. ఈ హంబోల్ట్ ఫోరమ్ వెలుపల ఒక ద్వారం ఉంది. ఇది భారతదేశంలోని సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతిరూపం. విదేశాంగ మంత్రి తన బెర్లిన్ పర్యటన సందర్భంగా సాంచి స్థూపం ద్వారం యొక్క ఈ ప్రతిరూపాన్ని చూసేందుకు వచ్చారు. దీంతో భారతదేశ సుందర వారసత్వాలు ప్రపంచ స్థాయికి చేరుకోవడంపై చర్చ మొదలైంది. భారతదేశంలోని సాంచి స్థూపం మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం.. భోపాల్ నుంచి 46 కి.మీ దూరంలో ఉంది. ఇది దేశంలోని బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర, నాగరికతకు చిహ్నం. ఇది మూడవ శతాబ్దం క్రితం గొప్ప భారతీయ చక్రవర్తి అశోకుడి కాలంలో నిర్మించబడింది. అయితే.. తరువాత పాలకులు దీనిని ధ్వంసం చేయగా.. మళ్లీ పునరుద్ధరించారు. దాదాపు 2700 ఏళ్ల తర్వాత కూడా అశోకుని సందేశాలను ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. బెర్లిన్‌లోని హంబోల్ట్ ఫోరమ్‌లో సాంచి స్థూపం యొక్క తూర్పు ద్వారంతో విదేశాంగ మంత్రి మరోసారి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. ఈ సందేశం కూడా చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధమైనా… ప్రతిరోజూ వందలాది మంది చనిపోతున్నారు.

Show comments