NTV Telugu Site icon

Viral News: స్నేహితులు ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు.. ఏం జరిగిందంటే..?

Karnataka

Karnataka

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు. తాగిన మైకంలోనే స్నేహితులు రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలోకి ఒక్కసారిగా దూకేశాడు. అతడికి ఈతరాక అలాగే నీటిలో మునిగి చనిపోయాడు. సాజిద్ ను కాపాడాల్సిన ఫ్రెండ్స్ వీడియోలు తీస్తు తెగ ఎంజాయ్ చేశారు. చివరకు సాజిద్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: Gunfire : లినెన్ కంపెనీలో మాజీ ఉద్యోగి కాల్పులు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

అయితే, సాజిద్, గోటి, అఫు గోమా, తాజుద్దీన్ అనే నలుగురు ఆటో డ్రైవర్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఇక, కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతదేహం హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అతను ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరిగిందో అనే దానిపై ఆరా తీస్తున్నారు.