NTV Telugu Site icon

Gujarat: ఉద్యోగం నచ్చలేదని తన వేళ్లు తానే కోసుకున్న యువకుడు..

Fingers

Fingers

మనం చేసే పని నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాత మానేస్తాం.. నచ్చిన ఉద్యోగం దొరికాక అందులో జాయిన్ అయి సంతోషంగా పని చేస్తాం. కొన్నిసార్లు ఎన్ని డబ్బులు వచ్చినా.. చేసే పని నచ్చకపోతే అందులో ఇమడలేకపోతాం. తాజాగా.. ఇక్కడ కూడా అలాంటి సంఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు కంప్యూటర్ ఆపరేటర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.. ఆ జాబ్‌ను వదిలేయడానికి తన నాలుగు వేళ్లను తానే కోసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.

Read Also: PV Sindhu : సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు

యువకుడు తన బంధువు దగ్గర డైమండ్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. అయితే.. ఆ ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని.. మానేస్తున్నానని తన బంధువుతో చెప్పే ధైర్యం లేక ఈ ఘటనకు పాల్పడ్డాడు. కంప్యూటర్‌ను ఆపరేట్ చేసే ఎడమ చేతి నాలుగు వేళ్లను పదునైన కత్తితో తనకు తానే కోసుకున్నాడు. బాధిత యువకుడు మయూర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం యువకుడు రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి వచ్చి చూస్తే తన వేళ్లు లేవు. పోలీసుల కథనం ప్రకారం.. ఎవరైనా చేతబడి కోసం అతని వేళ్లను కత్తిరించి ఉంటారని అనుమానించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తన వేళ్లను తానే కోసుకున్నాడని తేలింది.

Read Also: CP CV Anand : మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించిన సీపీ సీవీ ఆనంద్‌

ఓ షాపులో కత్తి కొన్నట్లు యువకుడు మయూర్ అంగీకరించాడు. శనివారం రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లి అక్కడ తన ద్విచక్రవాహనాన్ని పార్క్ చేశాడు. ఆ తర్వాత నాలుగు వేళ్లను కత్తితో కట్ చేసుకున్నాడు. అనంతరం.. కత్తి, కట్ చేసిన వేళ్లను బ్యాగ్‌లో పెట్టి దూరంగా పడేశాడు. ఈ ఘటనపై యువకుడు తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. యువకుడు పడేసిన బ్యాగ్‌లో మూడు వేళ్లు, మరో బ్యాగ్‌లో కత్తి లభించినట్లు పోలీసులు తెలిపారు.