Ongole YSRCP: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా సాగుదామని నిర్ణయించారు.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల నేతలు.. గత కొన్ని రోజులుగా ఒంగోలు వైసీపీ రాజకీయాలపై చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ఆ అభ్యర్థిని ఖరారు చేశారు.. కానీ, స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. అలిగారని.. ఇంచార్జ్‌లను మార్చే అవకాశం ఉందనే రకరకాల చర్చలు సాగుతూ వస్తున్న తరుణంలో.. వాటికి ఫులిస్టాప్ పెట్టేశారు వైసీపీ నేతలు.. విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిలు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Jyotiraditya Scindia: చిర్రగోనె ఆడిన కేంద్రమంత్రి.. వీడియో వైరల్
ఇక, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ భారీ విజయం సాధించేలా కృషి చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేయాలని, ఎన్నికల ముందుకు ఎలా పనిచేయాలి, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సమావేశం పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపినట్లయింది. మేమంతా ఒక్కటే అన్న సంకేతాన్ని ఇవ్వగలిగింది. మొత్తంగా గత కొంత కాలంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నేతలపై రకరాల ప్రచారాలు సాగుతూ రాగా.. ఈ రోజు విజయవాడలో జరిగిన సమావేశంతో వాటికి తెరపడినట్టు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు నేతలు.