Sucide Plant : భూమి చాలా విచిత్రమైనది. మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ భూమిపై ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని.. అడవులు పెంచాలని పర్యావరణ వేత్తలు చెబుతుంటారు. కానీ మానవులకు హానికలిగించే మనకు తెలియని చాలా మొక్కలు ఉన్నాయి. వాటిలో ఒకటి గింపై-గింపై ఇది చూడడానికి సాధారణ మొక్క వలే కనిపిస్తోంది. కానీ తాకినప్పుడు మండుతున్న అనుభూతి కలుగుతుంది. ఎంతలా అంటే ఆ సమయంలో ఉండే వేడి యాసిడ్ నుండి విద్యుత్ షాక్ లా అనిపిస్తుంది. ఈ మొక్క మనుషులను చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుందని, అందుకే దీనిని ‘ఆత్మహత్య మొక్క’ అని కూడా అంటారు.
ఈ మొక్కను మొదటిసారిగా 1866 సంవత్సరంలో కనుగొనబడింది. క్వీన్స్‌లాండ్‌లోని రెయిన్‌ఫారెస్ట్‌లో పనిచేసే వారికి లేదా కలపను కత్తిరించే వారికి, గింపైను మరణానికి మరో పేరుగా భావిస్తారు.అడవులకు వెళ్లే వారు రెస్పిరేటర్లు, మెటల్ గ్లోవ్స్ , యాంటిహిస్టామైన్ మాత్రలు (అలెర్జీ మరియు పెయిన్ కిల్లర్స్) తమ వెంట తీసుకెళ్తుంటారు. ఈ అడవుల గుండా వెళుతున్న చాలా జంతువులు, ముఖ్యంగా గుర్రాలు, తీవ్రమైన నొప్పితో చనిపోవడం ప్రారంభించాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, చాలా మంది ఆర్మీ అధికారులు కూడా దీని బారిన పడ్డారు. చాలా మంది ఆ మొక్క కలిగించే నొప్పిని భరించలేక కాల్చుకున్నారు. మిగిలిపోయిన వారు, వారు సంవత్సరాల తరబడి నొప్పి భరిస్తూ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. అప్పటి నుండి గింపై మొక్క మరింత మంది దృష్టిని ఆకర్షించింది. క్వీన్స్‌ల్యాండ్ పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్ తర్వాత అటవీ సందర్శకులకు ప్రమాదం నుండి దూరంగా ఉండేందుకు ఒక గైడ్‌ను తీసుకువచ్చింది.
మొక్క గురించి ప్రతిదీ తెలుసుకోవాలి..
దీని జీవసంబంధమైన పేరు డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్, ఇది ఆస్ట్రేలియాలోని ఈశాన్య వర్షారణ్యాలలో కనిపిస్తుంది. దీని సాధారణ పేరు gimpai-gimpai. కానీ దీనిని ఆత్మహత్య మొక్క, గింపై స్టింగర్, స్టింగ్ బ్రష్, మూన్‌లైటర్ వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియాతో పాటు, ఇది మొలుక్కాస్, ఇండోనేషియాలో కూడా కనిపిస్తుంది. చూడడానికి సాధారణ మొక్క వలె ఉంటుంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. మొక్క ఎత్తు 3 నుండి 15 అడుగుల వరకు ఉంటుంది.
ఇంత విషపూరితమైనది ఎందుకు?
చక్కటి జుట్టు లాంటి ముళ్లతో నిండిన ఈ మొక్కలో న్యూరోటాక్సిన్ పాయిజన్ ఉంటుంది. ఇది ముళ్ల ద్వారా శరీరంలోకి చేరుతుంది. న్యూరోటాక్సిన్ అనేది విషపదార్థం. ఇది నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. ముల్లు గుచ్చుకున్న అరగంట తర్వాత, నొప్పి తీవ్రత పెరుగుతుంది. తక్షణ చికిత్స అందకపోతే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
వదిలించుకోవటం కష్టం..
ముల్లు కుట్టిన తర్వాత తొలగించినప్పుడు నొప్పి సాధారణంగా ఉంటుంది. దాని ముళ్లు శరీరంలోకి దిగిన తర్వాత విరిగిపోయి చర్మంలో ఉండిపోతే, అప్పుడు విషయం మరింత విషమంగా మారుతుంది. ఈ మొక్క యొక్క విషాన్ని రసాయన ఆయుధంగా ఉపయోగించేందుకు బ్రిటన్ ల్యాబ్ పోర్టన్ డౌన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం, క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు అనేక అంతర్జాతీయ మీడియా నివేదికలు, డాక్యుమెంటరీల్లో పేర్కొన్నాయి.
ఈ మొక్కను నిర్మూలించవచ్చా?
ఏ మొక్కను తొలగించడం సాధ్యం కాదు, పర్యావరణ వ్యవస్థకు మంచిది కాదు. విపరీతమైన విషపూరితమైన గింపై- గింపైతో కూడా ఒక మంచి విషయం ఏమిటంటే, అనేక కీటకాలు, పక్షులు దాని పండ్లను తిని సంపూర్ణంగా జీవిస్తాయి.