NTV Telugu Site icon

Pinarayi Vijayan: కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..

Kerala

Kerala

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.

Read Also: Nitish Kumar: సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం..

తాజాగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ గవర్నర్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి నిరసనలు సహజమేనని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్‌కు సీఎం హితవు పలికారు. తాను చాలా సార్లు ప్రయాణాలు చేశానని.. కానీ ఎప్పుడు ఇలా కారు దిగి నిరసన తెలపలేదన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. గతంలో కేరళ పోలీసులను ప్రశంసించిన విషయాన్ని గవర్నర్ గుర్తుకు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు.

Read Also: Tejashwi Yadav: “అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది”.. సీఎం నితీష్‌పై తేజస్వీ ఫైర్..

తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భద్రతను కేంద్రం పెంచింది. ఆరిఫ్‌కు కేంద్ర హోంశాఖ జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లు రాజ్‌భవన్ వెల్లడించింది. ప్రభుత్వానికి-రాజ్‌భవన్ మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణ ఇంతటితో ముగుస్తుందా? లేదంటే ఇలానే కొనసాగుతుందో వేచి చూడాలి.