NTV Telugu Site icon

Lokshabha Elections: ఎన్నారై ఓటింగ్ శాతంపై ఆందోళన.. 1.2 లక్షల మందిలో ఓటు వేసింది ఎంత మందంటే?

Lokshabha Elections

Lokshabha Elections

లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే సమయంలో వీరిలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేర్చుకోగా, ఎన్నికల సమయంలో కేవలం 2.48 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు. 2024లో 1,19,374 మంది వలసదారులుగా నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేసింది. కేరళ నుంచి అత్యధికంగా 89,839 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో కేవలం 2,958 మంది మాత్రమే ఓటుల హక్కు వినియోగించుకున్నారు. అందులో 2,670 మంది కేరళ వాసులే ఉన్నారు.

READ MORE: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 885 మంది విదేశీ ఓటర్లలో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఓటు వేశారని నివేదిక వెల్లడించింది. మహారాష్ట్రలో కూడా 5,097 మంది ఎన్నారై ఓటర్లలో 17 మంది మాత్రమే ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,927 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉండగా.. 195 మంది మాత్రమే ఓటు హాక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ట్రాల నుంచి ఒక్క ఎన్నారై కూడా ఓటు వేసేందుకు భారత్‌కు రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్‌లో కూడా నమోదు చేసుకున్న 89 మంది ఎన్నారై ఓటర్లలో ఎవరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 84 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయని పరిస్థితి గోవాలో కనిపించింది. ఎన్నారై ఓటింగ్ తగ్గడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో ముందుగా సమయాభావం, భారీ ఛార్జీలను పరిగణనలోకి తీసుకున్నారు.

READ MORE: RRB Group D Recruitment 2025: ఏకంగా 32,000 ఉద్యోగాలను విడుదల చేసిన రైల్వేబోర్డు..

Show comments