NTV Telugu Site icon

United Nations: బంగ్లాదేశ్‌ నిరసనల్లో 1400 మంది మృతి.. ఐక్యరాజ్యసమితి వెల్లడి..

Bangladesh

Bangladesh

గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు, తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ దేశంలో భారీ హింసను చూసింది. బంగ్లాదేశ్‌లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజిద్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ చర్యలో కనీసం 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం బుధవారం అంచనా వేసింది.

READ MORE: Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….

గత సంవత్సరం జూలై 1 – ఆగస్టు 15 మధ్య జరిగిన నిరసనలలో 1,400 మందికి పైగా మరణించి ఉండవచ్చని మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. వేలాది మంది గాయపడ్డారని వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ భద్రతా దళాల కాల్పుల్లో మరణించారని స్పష్టం చేసింది. మరణించిన వారిలో 12 నుంచి 13% మంది పిల్లలే ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇందులో 44 మంది అధికారులు కూడా మరణించారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. ఉన్నత భద్రతా అధికారుల సమన్వయంతో బంగ్లాదేశ్‌లో నిరసనలను అణిచివేసేందుకు చట్టవిరుద్ధ హత్యలు, విస్తృతమైన ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు, హింసలు జరిగాయని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ తెలిపారు.

READ MORE: PM Modi Plane Cost: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ధర ఎంతో తెలుసా?

బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలంగా ప్రధాన మంత్రిగా ఉన్న షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆమెపై తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఈ సింహలో ఎంత మంది మరణించారు? అనే అంశాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తెలుసుకునేందుకు.. ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ బృందాన్ని బంగ్లాదేశ్‌కు ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కోటా వ్యవస్థను నిరసిస్తూ ఈ విద్యార్థి ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైందని.. క్రమంగా ఈ ఉద్యమం ఊహించని విధంగా షేక్ హసీనా, ఆమె పాలక అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటుగా మారిందని నివేదిక వెల్లడించింది.