Site icon NTV Telugu

Salaar 2 : రిపబ్లిక్ డే రోజు ప్రభాస్ ‘సలార్ 2’ అప్డేట్ రాబోతోందా?

Salaar 2

Salaar 2

ప్రస్తుతానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, సడెన్‌గా ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే, ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు సలార్ 2 కూడా అలాంటి ప్లానింగ్‌లో ఏమైనా ఉందా? అంటే, అవుననే మాట మాత్రం జోరుగా వినిపిస్తోంది. త్వరలోనే సలార్ 2 నుంచి బిగ్ అప్డేట్ రానున్నట్టుగా ప్రచారం మొదలైంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్మెంట్ ఉంటుందని, అంతేకాదు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Tollywood : 2026 సంక్రాంతి సినిమాల దర్శకులలో విన్నర్ ఎవరంటే?

ప్రస్తుతానికి ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలే.. సలార్ 2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి లీకేజీ వచ్చిన సరే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. అలాంటిది అనౌన్స్మెంట్, గ్లింప్స్ అంటే.. ఆ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజానికి సలార్ పార్ట్ వన్ తర్వాత ఇమ్మీడియెట్‌గా పార్ట్ 2 ఉంటుందని అనుకున్నారు. కానీ, ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా వెనక్కి వెళ్లింది. దీంతో.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నీల్. ప్రభాస్ కూడా కల్కి 2, స్పిరిట్ సినిమాలతో బిజిగా ఉన్నాడు. సో సొషల్ మీడియాలో వినిపిస్తున్నట్టు సలార్ 2 ఇప్పట్లో లేదు. అది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే!

Exit mobile version