కయాల్ ఆనంది.. ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ మరియు ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళ, తెలుగు చిత్రం అయిన ‘మాంగై’లో నటిస్తోంది. గుబెంతిరన్ కామచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుష్యంత్ జయప్రకాష్, రామ్ మరియు ఆదిత్య కతిర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. అమ్మాయి అందాలను సెల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ గా కొనసాగింది. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణమైన యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజా ట్రైలర్లో కూడా అదే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. కారులో ఆనంది, దుష్యంత్ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..వాటి నుంచి ఆనంది బయటపడిందా లేదా ప్రాణాలు కోల్పోయిందా..? అనేది మేకర్స్ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.