భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసింది. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం నిన్న (సోమవారం) ఢిల్లీ నుంచి భోపాల్ కు చేరుకుంది.
Also Read: Durga stotra: ఈ స్తోత్రాలు వింటే అనంతమైన పుణ్యం లభిస్తుంది
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసులో అనేక విషయాలను ఆరా తీస్తుంది. గత నెల 9న.. ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేశారు. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (HUT) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
హిజ్బ్ ఉత్ తెహ్రీర్ టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ ఏటీఎస్.. ఎన్ఐఏ అధికారులు సమీకరిస్తున్నారు. అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read: Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన
ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్‌ఐఏ అధికారులు నిర్ణయించింది.