NTV Telugu Site icon

Telangana Formation Celebrations: ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు- సీఎస్

Cs

Cs

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Read Also: Rajkot game zone: డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
సాయంత్రం ట్యాంక్ బండ్ పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీ పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు. ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్, మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ ప్రదర్శన, లేజర్ షో ఏర్పాటు చేశారు.

Read Also: Jupalli Krishna Rao: నిబంధ‌ల‌న మేర‌కే సోమ్ డిస్టిల‌రీస్ బ్రాండ్ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి..

ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ళచే స్టాళ్ళ ఏర్పాటు, చిన్న పిల్లలకు గేమింగ్ షోల ఏర్పాటు చేశారు.