ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. మరోవైపు.. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచరంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు.
Read Also: Heavy Rains: తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
బడ్జెట్ సెషన్‌లో సమన్వయ లోపం గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎస్ తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. నోట్ ఆన్ డిమాండు మరియు రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని, తద్వారా సభ్యులు దానిని పరిశీలించడానికి.. చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అధికారులను కోరారు.
Read Also: Ambani Wedding: పెళ్లిని ప్రమోట్ చేయడానికి భారీ మొత్తం ఆఫర్.. కానీ నిరాకరించిన ఇన్‌ఫ్లుయెన్సర్..