NTV Telugu Site icon

IND vs AFG: రాణించిన సూర్య కుమార్.. భారీ స్కోరు చేసిన భారత్

Surya

Surya

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ముందు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా.. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్.. ఇంత స్కోరు చేయగలిగింది. 28 బంతుల్లో 53 పరుగులతో చేలరేగాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (32) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (24), రిషబ్ పంత్ (20) పరుగులు చేశారు.

PM Modi: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఎంతో దూరంలో లేదు.. పీఎం మోడీ హామీ..

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్.. మొదట్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ (8) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ నెమ్మదిగా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడనే లోపే (24) పరుగులు చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లో పంత్ (20) పరుగులు చేసి ఎల్బీగా వెనుతిరిగాడు. కీలక సమయంలో.. సూర్య కుమార్ క్రీజులో ఉండి పరుగుల వరద పారించాడు. దీంతో అర్ధ సెంచరీతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత శివం దూబె (10) పరుగులకే వెనుతిరిగాడు. వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (32) పరుగులతో జట్టుకు కీలక పరుగులు అందించాడు. రవీంద్ర జడేజా(7), అక్షర్ పటేల్ 12, అర్ష్ దీప్ సింగ్ (2) పరుగులు చేశారు.

Tirupati: భోజనం ప్లేటులో జెర్రీ ప్రత్యక్షం.. హోటల్‌పై కేసు నమోదు

ఆఫ్ఘానిస్తాన్ బౌలింగ్ లో ఫజల్హక్ ఫారూఖీ 3 కీలక వికెట్లు తీశాడు. అతనితో పాటు స్పిన్ మాయజాలం రషీద్ ఖాన్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీశాడు. ఆఫ్ఘాన్ 120 బంతుల్లో 182 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. భారత బౌలర్లు ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.