Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
- భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ నవ్వుతున్న చిత్రం
- నోటుపై ముద్రించిన బాపు చిత్రం 1946లో క్లిక్ చేసిన ఫోటో
- గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanthi 2024: ఈ రోజు దేశం మొత్తం మహాత్మ గాంధీ జయంతిని జరుపుకుంటోంది. మన భారతీయ కరెన్సీ పై గాంధీ ఫొటోస్ ఉండటం చూస్తున్నాం.. కానీ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండగా, ఆయన ఫోటోలను పెట్టడానికి అసలు కారణాలు చాలామందికి తెలియదు.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఆ స్టోరీ ఏంటో ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోని వివిధ దేశాల నోట్లపై ఆయా దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలు ముద్రించబడతాయి. అమెరికాలోని ప్రతి నోట్‌పై వేర్వేరు అధ్యక్షులు, ఇతర వ్యక్తుల చిత్రాలు ఉంటాయి. బ్రిటన్‌లో రాజు చిత్రం ఉంటుంది. అదే సమయంలో.. భారతదేశంలో ప్రతి కరెన్సీ నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశం కరెన్సీ నోట్ల పై అశోక చక్రం ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆర్బీఐ తర్వాత గాంధీ బొమ్మను ముద్రించారు. నోటుపై ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం 1946లో తీసిన ఫోటో నుంచి కత్తిరించబడిందట. ఆ ఫోటోలో గాంధీబ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెథిక్-లారెన్స్‌తో కలిసి ఉన్నారట. ఈ ఛాయాచిత్రం గాంధీజీ యొక్క చిరునవ్వు వ్యక్తీకరణకు తగిన విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఎంపిక చేయబడింది. అయితే ఫోటోగ్రాఫర్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. మహాత్మా గాంధీ చిత్రాన్ని ఎవరు క్లిక్ చేశారనేది ప్రశ్నగానే మిగిలింది.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
1969లో ఆయన 100వ జయంతిని పురస్కరించుకుని భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం తొలిసారిగా కనిపించింది. 1969లో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన నోటును విడుదల చేసింది. ఇందులో సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీజీ కూర్చొని ఉన్న ఫోటోని నోట్ల పై ముద్రించారు.. మన కరెన్సీ నోటుపై 1987లో మొట్టమొదటిగా నవ్వుతున్న జాతిపిత చిత్రం ముద్రించబడింది. అదే ఏడాదిలో అక్టోబర్‌లో రూ.500 నోటును ముద్రించారు. అందులో గాంధీ చిరునవ్వుతో కూడిన చిత్రం కనిపించింది. దీని తరువాత అప్పటి నుంచి ఇప్పటివరకు అదే నోట్లను ముద్రిస్తున్నారు.. ఇంకో విషయం ఏంటంటే.. నోటుపై గాంధీ గారికన్నా ముందు బ్రిటన్ రాజు జార్జ్ VI చిత్రం ఉంది. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో గాంధీ బొమ్మని ముద్రించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ అది జరగడానికి చాలా సమయం పట్టింది.. అలా ఇప్పుడు గాంధీ బొమ్మను నోట్ల పై ముద్రిస్తున్నారు.. ఒక లెజెండ్ పర్సన్ అనే చెప్పాలి.. స్వాతంత్య్రం రావడానికి మూల కారణం గాంధీజీ.. ఈరోజు ఆయన జయంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం.
నకిలీ నోట్ల భయంతో కొత్త ఫీచర్లు
తదనంతరం, 1996లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన కొత్త సిరీస్ నోట్లను విడుదల చేసింది. నిజానికి 1990ల నాటికి, నకిలీ నోట్ల తయారీ సాంకేతికత చాలా అభివృద్ధి చెందినట్లు RBI గమనించింది. డిజిటల్ ప్రింటింగ్, స్కానింగ్, ఫోటోగ్రఫీ, జిరోగ్రఫీ వంటి సాంకేతికతలు నకిలీ నోట్ల తయారీని సులభతరం చేశాయి. మానవ ముఖాల కంటే నిర్జీవ వస్తువులను కాపీ చేయడం సులభమని ఆర్బీఐ విశ్వసించింది. అందుకే కొత్త నోట్లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. గాంధీజీ జాతీయ ఆకర్షణ కారణంగా ఎంపికయ్యారు. కొత్త నోట్లకు అనేక కొత్త భద్రతా ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. వీటిలో విండోస్ సెక్యూరిటీ థ్రెడ్, అజ్ఞాత చిత్రం, దృష్టి లోపం ఉన్నవారి కోసం ఇంటాగ్లియో ఫీచర్లు ఉన్నాయి. ఆ తర్వాత 2016లో ఆర్బీఐ మరోసారి కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లను ‘మహాత్మాగాంధీ న్యూ సిరీస్’ అని పిలిచారు. ఈ నోట్లపై కూడా గాంధీజీ చిత్రం ఉంది.
తాజావార్తలు
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?