ఈ ఫోటోలు ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, ఆయన సోదరుడు ప్రముఖ హీరో వెంకటేశ్ తో పాటు తమిళ నటుడు విజయ్ కుమార్, డి. రామ్మోహన్ (గడ్డంతో ఉన్న వ్యక్తి), అలాగే కీ.శే రామానాయుడు కజిన్ డి. మల్లిఖార్జున రావు ఉన్నారు. ఇది ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఛాయా చిత్రం. ఆ సినిమా పేరు ‘మధురగీతం’. డా. రామానాయుడు తన భాగస్వాములతో కలసి వేరే బ్యానర్ లో తీసిన సినిమా ఇది. ప్రస్తుత క్యారక్టర్ ఆర్టిస్ట్, అప్పటి హీరోయిన్ మంజుల భర్త విజయ్ కుమార్ హీరోగా నటించారు. శ్రీవిద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు చంద్రబోస్ సంగీతం అందించగా వి.సి. గుహనాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ నటుడుగా కనిపించటం విశేషం.
Read Also:VBVK: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. శివరాత్రికి ఆ కథేంటో వినండి..