AP Crime: దారుణం.. బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

  • చిత్తూరు జిల్లాలో దారుణం
  • బాలుడిని  నేలకేసి కొట్టి చంపిన సవతి తండ్రి
  • చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీషకు ఒక కూతురు.. ఇద్దరు కొడుకులు
  • గత కొన్నేళ్లుగా భర్తతో విభేదాలతో ప్రదీప్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తున్న శిరీష
  • తాగిన మైకంలో శిరిష ఏడాదిన్నర కొడుకు దినేశ్‌ను నేలకేసికొట్టి చంపిన ప్రదీప్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Crime

Crime

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: UP: యువకుడిని 30 రోజుల్లో 5 సార్లు కాటేసిన పాము.. ఎక్కడికెళ్లిన వెంబడించి మరీ…

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీష అనే వివాహితకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె తన భర్తతో విభేదాలతో దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రదీప్ అనే వ్యక్తితో శిరీష సహజీవనం సాగిస్తుంది. అయితే.. ఇంటికి తాగొచ్చిన ప్రదీప్ ఆ మైకంలో శిరీష ఏడాదిన్నర కొడుకు దినేష్ ను నేలకేసి కొట్టి చంపాడు. కాగా.. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు